బిగ్‌ టైటిల్‌ రేస్‌.. విన్నింగ్‌ ఆర్డర్‌ ఇదేనా.?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌ ముగింపుకి వచ్చేస్తోంది. నిన్నటి నుంచే ఓటింగ్‌ మొదలైపోయింది కూడా. టైటిల్‌ విన్నర్‌ ఎవరు.? అన్నదానిపై సోషల్‌ మీడియా వేదికగా చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఆయా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫాలోవర్స్‌ మధ్య. టాప్‌ ఫైవ్‌లోంచి శివజ్యోతి ఔట్‌ అయిపోయింది. రేసులో రాహుల్‌ సిప్లిగంజ్‌, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, శ్రీముఖి, అలీ రెజా నిలిచారు.

 

వీరిలో ఎవరు విన్నర్‌ అవుతారు.? అసలు విన్నింగ్‌ ఆర్డర్‌ ఎలా వుండబోతోంది.? అన్న ఉత్కంఠ కాస్త గట్టిగానే కన్పిస్తోంది. నిన్నటి ఎపిసోడ్‌లో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సందడి చేయడంతో బిగ్‌బాస్‌కి ఒకింత 'కిక్‌' వచ్చినట్లయ్యింది. పైగా, బిగ్‌బాస్‌పై విజయ్‌ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలూ చేశాడు. శ్రీముఖితో కలిసి తన సినిమాల్ని ప్రమోట్‌ చేశాననీ, రాహుల్‌ని ఓ సందర్భంలో తాను కలిశాననీ, వరుణ్‌ సందేశ్‌ తనకు కాలేజ్‌లో సీనియర్‌ అనీ చెప్పాడు విజయ్‌ దేవరకొండ. మరోపక్క, హీరోగా మారిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, తన పెళ్ళి చూపులు సినిమాని అలీ రెజా సొంత హోటల్‌లోనే రాసుకునేవాడినని చెప్పడం గమనార్హం. దాంతో, ఆయా కంటెస్టెంట్స్‌కి అదనపు అడ్వాంటేజ్‌గా మారింది.

 

ఇదిలా వుంటే, తాజా ఊహాగానాల ప్రకారం అలీ రెజా, బాబా భాస్కర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి ఔట్‌ అయిపోతారనీ, వరుణ్‌ సందేశ్‌ విన్నర్‌గా నిలుస్తాడనీ అంటున్నారు. అయితే, బిగ్‌హౌస్‌లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేం. నిజానికి శివజ్యోతిని టాప్‌ 5కి బిగ్‌బాస్‌ పంపించేస్తాడనే ప్రచారం జరిగింది. ఎప్పుడో ఎలిమినేట్‌ అవ్వాల్సిన ఆమె నిన్నటిదాకా హౌస్‌లో వుండడమే విచిత్రం. కాబట్టి, ఇప్పుడే ఏమీ చెప్పలేం.. బిగ్‌ విన్నర్‌ గురించి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS