నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరిన 'ఖైదీ' రెస్పాన్స్‌.!

By Inkmantra - October 26, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

కార్తి హీరోగా నటించిన 'ఖైదీ' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. చాలా రిస్కీగా, ధైర్య సాహసాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. గ్లామర్‌ లేకపోతే, ప్రేక్షకుల్ని ధియేటర్స్‌కి రప్పించలేని రోజులివి. అలాంటిది, హీరోయిన్‌ లేకుండానే ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం. అనుకున్న టైంకి, అనుకున్న విధంగా రిలీజ్‌ చేయడం ఇంకో విశేషం. అన్నింటికీ మించి సినిమాకి పోజిటివ్‌ టాక్‌ రావడం గొప్ప విశేషం. ఈ జోష్‌తో సినిమాకి సీక్వెల్‌ ఆలోచన చేస్తున్నారట దర్శకుడు లోకేేష్‌ కనకరాజ్.

 

అయితే, నిజానికి సీక్వెల్‌ ఆలోచన డైరెక్టర్‌దీ కాదు, హీరో కార్తిదీ కాదు. ఈ సినిమా చూసిన ఆడియన్స్‌ రెస్పాన్స్‌. సినీ ప్రముఖులు ఇచ్చిన గుడ్‌ సజిషన్‌. సో అలా ఈ సినిమాకి అనుకోకుండానే సీక్వెల్‌ చేసే ఆలోచన వచ్చింది. సీక్వెల్‌ కోసం ఆడియన్స్‌ ఆలోచించారంటే, వారిని ఎంతగా ఈ సినిమా ప్రభావితం చేసి ఉంటుందో అర్ధం చేసుకోవాలి. అందుకే సీక్వెల్‌ విషయంలో దర్శకుడు లోకేష్‌ స్పందించాడు.

 

'దిల్లీ మళ్లీ వస్తున్నాడు' అని ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఓ పోస్ట్‌ పెట్టి, సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. 'ఖైదీ'కి ఇంత మంచి విజయం అందించినందుకు ఆడియన్స్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు. కోలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS