2016 డబ్బింగ్‌ డిజాస్టర్‌: కబాలి

మరిన్ని వార్తలు

2016లో వచ్చిన సూపర్‌స్టార్‌ మూవీ 'కబాలి'. ఈ సినిమా విడుదలకు చేసిన ప్రమోషన్‌ హడావిడి అంతా ఇంతా కాదు.కేవలం టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి. ఆ అభిమానంతోనే ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ చేశారు. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కింది ఈ సినిమా. ఇక ప్రమోషన్‌కి చేసిన ఖర్చు అయితే లెక్కే లేదు. చిత్ర యూనిట్‌ తరపున కాకుండా, పెద్ద పెద్ద కమర్షియల్‌ కంపెనీలు కూడా ఈ సినిమా విషయంలో భారీగా పబ్లిసిటీ బిజినెస్‌ని చేశారు. కానీ ప్రమోషన్స్‌లో ఉన్న ఎఫెక్ట్‌ సినిమా విడుదలయ్యాక లేదు. విడుదలయిన రోజే ఈ సినిమాను జనం మర్చిపోయారంటే ఎంతగా ఈ సినిమా నిరాశపరిచిందో అర్ధం చేసుకోవచ్చు. 


ఈ సినిమా కోసం ఏకంగా స్పెషల్‌ ఫ్టైట్‌తో ప్రమోషన్‌ జరిగింది. 'కబాలి' పేరుతో, కబాలి పోస్టర్స్‌తో ఈ ఫ్టైట్‌ని తయారు చేయించారు. 'కబాలి' స్టాంపులు, కబాలి చాక్లెట్టు, కబాలి పేరుతో నాణాలు కూడా ముద్రించారు. అంతగా కబాలి ఫోబియా జరిగింది. కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అయితే ఈ సినిమా రిలీజ్‌ కోసం తమ ఆఫీసులకు సెలవులు కూడా ప్రకటించేశారు. మిలియన్స్‌ స్థాయిలో ఈ సినిమా టిక్కెట్లు అమ్ముడయిపోయాయి. ఇండియాలోనే కాకుండా, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ సినిమా విడుదలయ్యింది. అన్ని చోట్లా ఒక్కటే రిజల్ట్‌ చూసింది.ఈ అంచనాలతో తెలుగులో కూడా భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాని కొన్నారు. సినిమా రిజల్డ్‌ రివర్స్‌ కావడంతో సదరు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. 


పా రంజిత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అమలా పాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ సీన్స్‌ బాగున్నాయి. లొకేషన్స్‌ అదిరిపోయాయ్‌. కానీ ఎందుకో సూపర్‌స్టార్‌ నుండి అభిమానులు ఆశించిన స్థాయిలో ఉండాల్సిన ఎలిమెంట్స్‌ని ప్రెజెంట్‌ చేయడంలో డైరెక్టర్‌ పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో సినిమా రజనీకాంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌గా నటించాడు ఈ సినిమాలో రజనీకాంత్‌. దాంతో విడుదలకి ముందు రజనీ గత సినిమా 'భాషా'తో పోల్చుతూ అంచనాలు ఆకాశానికంటాయి. కానీ విడుదలయ్యాక 'భాషా'తో పోల్చలేక, సరిపెట్టుకోలేక ఫ్యాన్స్‌ చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. కానీ సినిమా పబ్లిసిటీ విషయంలో మాత్రం రికార్డులు దాటేసింది. ప్రపంచ దేశాల్లో కూడా ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్‌ జరిగాయి. ఆ రకంగా ఈ సినిమా సెన్సేషన్‌ అయ్యింది. కానీ రిజల్ట్‌ విషయంలో మాత్రం సెన్సేషనల్‌ డిజాస్టర్‌గా రిజిస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా 'రోబో 2.0' సినిమా తెరకెక్కుతోంది. శంకర్‌ డైరెక్షన్‌లో వస్తోంది ఈ సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS