నిర్మాతకు లాభం.. ఈ మాట విని చాలా రోజులైంది. పైగా మూడు రోజుల్లోనే. బింబిసార ఈ ఫీట్ ని సాధించింది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా, విశష్ట్ అనే నూతన దర్శకుడు రూపొందించిన చిత్రమిది. శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది. వసూళ్లు కూడా అదిరిపోయాయి. తొలి మూడు రోజులకు గానూ... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.15.55 కోట్లు తెచ్చుకొంది. ఈ సినిమాని రూ.14 కోట్లకు అమ్మారు. అంటే.. ఇప్పటికే 1.5 కోట్లు లాభమన్నమాట. సోమవారం నుంచి ఎంతొచ్చినా ఈ సినిమాకి లాభమే. కనీసం బయ్యర్లు రూ.8 నుంచి రూ.10 కోట్ల లాభం మూటగట్టుకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బింబిసార మూడు రోజుల లెక్కలు:
నైజాం: రూ.5.4 కోట్లు
సీడెడ్: రూ.3.35 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.2.18 కోట్లు
గుంటూరు: రూ.1.28 కోట్లు
ఈస్ట్: రూ.1.02 కోట్లు
వెస్ట్: రూ.74 లక్షలు
కృష్ణ: రూ.98 లక్షలు
నెల్లూరు: రూ.49 లక్షలు