శుక్రవారం విడుదలైన బింబిసార మంచి టాక్ సంపాదించుకొంది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా కొత్త కుర్రాడు వశిష్ట్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది. సోషియో ఫాంటసీగా రూపొందించిన ఈ చిత్రానికి తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా రూ.6 కోట్లు అందుకొంది. నిజంగానే ఇది కల్యాణ్ రామ్ సినిమాకి శుభారంభమే అనుకోవాలి.
నైజాం: 2.22 కోట్లు
సీడెడ్: 1.24 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.90 కోట్లు
గుంటూరు: 0.57 కోట్లు
ఈస్ట్: 0.44 కోట్లు
వెస్ట్: 0.35 కోట్లు
నెల్లూరు: 0.26 కోట్లు తెచ్చుకొంది. మొత్తానికి రూ.6 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్కలు తేలాల్సివుంది. ఎలా చూసినా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7.5 కోట్లు తెచ్చుకొనే అవకాశం ఉంది. శని, ఆదివారాలూ ఇదే జోరు కొనసాగితే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం.