ఇండస్ట్రీలో వెలిగిపోవడానికి ఒక్క హిట్ చాలు. సరైన ఒక్క హిట్ పడితే ఆ హిట్ వెనుక పడుతుంది ఇండస్ట్రీ. ఆలాంటి సరైన విజయం బింబిసారతో అందుకున్నాడు దర్శకుడు మల్లిడి వశిష్ట. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బింబి. థియేటర్ కి జనాలు రావడం తగ్గిపోతున్న తరుణంలో ఒక కెరటంలా వచ్చిందీ సినిమా. తన తొలి సినిమాకే ఇంతటి హిట్ ఇచ్చిన మల్లిడి వశిష్ట ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ దర్శకుల జాబితాలోకి చేరాడు. పరిమిత బడ్జెట్ ఒక టైం ట్రావెల్ కథని ఎపిక్ నేపధ్యంలో ప్రజంట్ చేసి అందరినీ అబ్బురపరిచారు మల్లిడి వశిష్ట.
బింబిసార చూసిన తర్వాత హీరోలు, నిర్మాతలు వశిష్టతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద హీరోల నుండి అతనకి కాల్స్ వెళ్ళాయి. కొందరు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. అయితే వశిష్ట ఆ అడ్వాన్స్ లని పట్టుకోవడం లేదు. ఇప్పుడు అతని ద్రుష్టి బింబిసార 2 పైనే వుంది. కళ్యాణ్ రామ్ మంచి నిర్మాత కూడా, బింబిసార 2 కూడా విజయం సాధిస్తే.. కళ్యాణ్ రామ్ ఆ స్థానంలో వశిష్ట స్థిరపడిపోవచ్చు. కళ్యాణ్ రామ్ కి తనే కాకుండా ఇతర సినిమాలు కూడా చేయాలని వుంది. కళ్యాణ్ రామ్ లాంటి నిర్మాత దగ్గర వుండగా అప్పుడే మరో నిర్మాత గురించి అలోచించడం లేదు వశిష్ట.
ఇప్పుడు మరో ఆలోచన లేకుండా బింబిసార 2ని సిద్ధం చేయడమే వశిష్ట ముందున్న ఏకైక లక్ష్యం.