'ఆవకాయ్ బిర్యానీ', 'బంపర్ ఆఫర్' తదితర సినిమాల్లో నటించిన పదహారణాల తెలుగమ్మాయ్ బిందు మాధవిని తెలుగు ప్రేక్షకులు తొందరగానే మర్చిపోయారు. తెలుగు సినిమా పరిశ్రమ కాదనుకున్నా, ఆమెను తమిళ సినీ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. అదేంటో, తెలుగమ్మాయిలకి ఇదో బ్యాడ్ సెంటిమెంట్. ఇక్కడ ఫెయిలయితే, అక్కడ స్టార్‌డమ్ దక్కేస్తుంటుంది. కలర్స్ స్వాతి కూడా అంతే. అర్చన అలియాస్ వేద కూడా తమిళంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంది. శ్రీదివ్య, రీతూ వర్మ తదితరులందరూ అంతే. బిందుమాధవి ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తూ ఒకింత బిజీగానే ఉంది. విమెన్స్ ఎక్స్‌క్లూజివ్ (డబ్ల్యుఈ) కోసం ఇదిగో ఇలా హాట్ హాట్‌గా పోజులిచ్చి, గ్లామర్‌లో తాను బాలీవుడ్ బ్యూటీస్‌కి ఏమాత్రం తక్కువ కాదనే సంకేతాలు పంపుతోంది. ఏం చేస్తాం, ఎంత అందమున్నా, అభినయించగలిగే టాలెంట్ ఉన్నా అదృష్టమంటూ కలిసిరావాలి కదా! పర భాషా నటీమణుల వెంట పడ్తోన్న టాలీవుడ్ ప్రముఖులు, లోకల్ బ్యూటీస్‌ని కాస్తంత కన్సిడర్ చెయ్యండహో!