దర్శకరత్న జీవితం పైన బయోపిక్!

మరిన్ని వార్తలు

దర్శకరత్న దాసరి నారాయణ రావు లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీర్చలేనిది. ఇక ఆయన జీవితం, సినీపరిశ్రమలో అడుగుపెట్టాలి అని అనుకునే ఎంతోమందికి ఆదర్శప్రాయం.

అలాంటిది ఇప్పుడు ఆయన జీవితం పైనే ఒక చిత్రం నిర్మితమవుతుంది. వివరాల్లోకి వెళితే, ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడైన ఓ. కళ్యాణ్.. దాసరి బయోపిక్ తీస్తాను అని ప్రకటించాడు. ఇక ఈ చిత్రానికి దాసరిగారి శిష్యులలో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలిపాడు.

ఈ చిత్రంలో ఆయన సినీ ప్రస్తానం నుండి మొదలుపెట్టి ఆయన సాధించిన విజయాలు అన్నీ చూపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రమే ఆయనకు తాను ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS