అక్కడ అజిత్‌, ఇక్కడ జగపతిబాబు

మరిన్ని వార్తలు

కాలంతోపాటు ఎవరైనా మారాలి. అలా మారడం వల్లే కొత్త జోనర్‌లో కొత్త కొత్త విజయాలు అందుకుంటున్నానని జగపతిబాబు అంటుంటారు. జుట్టు, గడ్డం, మీసం నెరిసిపోతే వయసయిపోయిందనుకోవడం ఓల్డ్‌ ట్రెండ్‌. ఆ లుక్‌లోంచే స్టైలిష్‌ అప్రోచ్‌ని కనుగొనడం న్యూ ట్రెండ్‌. జగపతిబాబు కొత్త ట్రెండ్‌ సృష్టించారు. ఆ ట్రెండ్‌లోనే దూసుకెళుతున్నారు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తున్న జగపతి, 'పటేల్‌ సర్‌' మూవీతో ఇంకో సంచలనానికి రెడీ అయ్యారు. జులై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ మెలోడీ సాంగ్‌ని లేటెస్ట్‌గా విడుదల చేశారు. ఈ సాంగ్‌ ప్రోమోలో జగపతిబాబు అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. పాస్ట్‌, ప్రెజెంట్‌ మోడ్స్‌లో ఈ పాట సాగుతుంది. పాస్ట్‌లో, ప్రెజెంట్‌లో జగపతి లుక్‌ దేనికదే అన్నట్లుగా ఉంది. ఓ చిన్నారి చుట్టూ సాగే కథ ఇది. జగపతి స్టైలిష్‌ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. వారాహి సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో అజిత్‌ నెరిసిన జుట్టు, గడ్డం, మీసంతోనే స్టైలిష్‌ లుక్‌ని సొంతం చేసుకున్నాడు. ఆ గెటప్‌లోనే సత్తా చాటుతున్నాడు. జగపతి కూడా మరో కొత్త ఇన్నింగ్స్‌ని కొత్త కొత్తగా స్టార్ట్‌ చేశాడనుకోవచ్చు. ఏదేమైనా జగపతిలో ఈ మార్పు అన్‌ బిలీవబుల్‌ అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS