బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు హాట్నెస్ గురించి అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో తెలుగులో మహేష్‌బాబు హీరోగా నటించిన 'టక్కరి దొంగ' సినిమాలో నటించి, సౌత్ ప్రేక్షకులకు కూడా తన అంద చందాల విందు చేసేసింది ఈ హాట్ భామ. అంతేనా ఈ మధ్య పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి ఓ కండోమ్ యాడ్‌లో నటించింది. ఆ యాడ్‌లో విచ్చల విడిగా అందాల ప్రదర్శన చేసిందంటూ విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆ తర్వాత ఆ యాడ్ వివాదాంశం అయ్యిన సంగతి కూడా తెలిసిందే. ఆ సంగతి అలా ఉంచితే, బాలీవుడ్లో ఓ ఫ్యాషన్ షో నిమిత్తం తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇదిగో ఇలా ఎర్రని ముద్ద మందారంలా మెరిసిపోతోంది. రెడ్ కలర్ డ్రస్సులో నిండుగా అందాలొలికిస్తోంది. బిపాషా నుండి ఆశించే గ్లామర్‌లో కొంచెం గ్లామర్ డోస్ తక్కువైనా కానీ, ఆమె కళ్లలోనే ఏదో మత్తుంటుందిగా. ఆ మత్తులోనే కుర్రకారు చిత్తైపోతోంది మరి.