సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కాదు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం, రాజకీయ నాయకులు సినిమా వాళ్లతో చేతులు కలపడం మామూలే. రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా, అందుకు సంబంధించిన అంశాలపై స్టార్లు మాట్లాడాలి. లేదంటే... సామాజిక స్పృహ లేదంటారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, చేతకాని తనాన్నీ స్టార్లు ఎత్తి చూపేది అందుకే. కాకపోతే.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులూ ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకోవాల్సిందే. ప్రస్తుతం సిద్దార్థ్ కి అలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
సిద్దార్థ్ సోషల్ ఇష్యూలపై ఎప్పటికప్పుడు తన స్పందన తెలియజేస్తుంటాడు. ఈమధ్య సిద్దూ చేసిన కొన్ని ట్విట్లూ, వ్యాఖ్యలు బీజేపీ మద్దతు దార్లకు కోపం తెప్పించాయి. దాంతో.. సిద్దూకి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయట. ఒక్క రోజే దాదాపు 5వందల మంది ఫోన్లు చేసి బెదిరించారట. చంపేస్తాం... ఇంట్లోవాళ్లని రేప్ చేస్తాం.. అన్నట్టు ఫోన్లు చేశారని, ఆ ఫోన్ రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని, వాటిని పోలీసులకు అప్పజెప్పి, కేస్ పెడతానని అంటున్నాడు సిద్దార్థ్.
ఇంతమందికి సిద్దూ ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందా? అంటే దానికీ ఆన్సర్ ఉంది. కొంతమంది బీజేపీ నాయకులు కావాలనే సిద్దూ నెంబర్ ని లీక్ చేశార్ట. అలా.. సిద్దూ నెంబర్ చాలామందికి చేరిపోయింది.