చిక్కుల్లో ప‌డ్డ 'సీత‌'

By iQlikMovies - May 22, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

మ‌రి కొద్ది గంట‌ల్లో విడుద‌ల కానున్న సినిమా 'సీత'. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించింది. అయితే.. ఈ సినిమాని నిషేధించాల‌ని ఓ వ‌ర్గం ప‌ట్టుప‌డుతోంది. `సీత`లో హిందుత్వ‌ధ‌ర్మాల్ని కించ‌ప‌రిచే అంశాలు ఉన్నాయ‌ని, సీత పేరు పెట్టుకుని హిందూ మ‌తానికి భంగం క‌లిగించే విష‌యాల్ని ప్ర‌చారం చేస్తున్నార‌ని బీజేవైఎం సంస్థ ఆరోపిస్తోంది. ఈసినిమాని నిషేధించాల‌ని పిలుపునిచ్చింది.

 

హిందూ మ‌త‌స్థులు ఈ సినిమా చూడ‌కూడ‌ద‌ని పిలుపునిచ్చింది. ట్రైల‌ర్లో ఉన్న సంభాష‌ణ‌లు త‌మ మ‌తాన్ని కించ‌ప‌రుస్తున్నాయ‌ని, మ‌హిళ‌ల‌పై ఉన్న గౌర‌వాన్ని త‌గ్గిస్తున్నాయ‌ని ఈ సంస్థ ఆరోపిస్తోంది. ఈ సినిమా విడుద‌ల కాకుండా అడ్డుకోవ‌డానికి ఈ సంస్థ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంద‌ని స‌మాచారం. మ‌రి... ఈ ఆరోప‌ణ‌ల్ని తేజ అండ్ కో ఎలా తిప్పికొడ‌తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS