బ్లాకు బస్టరు.. బ్లాకు బస్టరే!

మరిన్ని వార్తలు

మురుగదాస్‌ సంకేతాలిచ్చాడు బ్లాక్‌ బస్టర్‌ ఆన్‌ ద వే అని. మహేష్‌ న్యూ ఇయర్‌ విషెస్‌ చెబితే, మురుగదాస్‌ రెస్పాన్స్‌ ఇది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'సంభవామి' సినిమా వస్తోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. బై లింగ్వల్‌ సినిమా లాంటిదిన్న మాట. వంద కోట్ల మార్క్‌ దాటి అద్భుతాలు సృష్టిస్తుందని టాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. దర్శకుడు ఎస్‌జె సూర్య ఈ సినిమాలో మహేష్‌కి విలన్‌గా నటిస్తున్నాడు. మామూలుగా మురుగదాస్‌ ఏ సినిమా గురించీ ముందుగా గొప్పలు మాట్లాడడు. అలాంటిది 'బ్లాక్‌ బస్టర్‌ ఆన్‌ ద వే' అని చెప్పాడంటే ఇంకేమన్నా ఉందా? అభిమానులు ఇప్పుడు ఈ మాట పట్టుకునే ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. టాలీవుడ్‌లో 2017లో విడుదలయ్యే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఇది కూడా ఒకటి. మురుగదాస్‌ సినిమాలు యూనివర్సల్‌ కంటెంట్‌తో ఉంటాయి. దాంట్లో చక్కని మెసేజ్‌ కూడా ఉంటుంది. అలాగే కమర్షియల్‌ అంశాల్ని ఎక్కడా మిస్‌ అవడు. మాస్‌, క్లాస్‌ మెచ్చే అంశాలతో మెసేజ్‌ని చెప్పడం మురుగదాస్‌ స్పెషాలిటీ. ఇన్ని స్పెషల్‌ క్వాలిటీస్‌ ఉన్నాయి ఈ సినిమాకి. ఎప్పుడూ తన సినిమా గురించి ముందుగా గొప్పలు చెప్పని మురుగదాసే ఈ సినిమా గురించి ఇంతగా చెప్పడమే ఓ పెద్ద స్పెషల్‌ క్వాలిటీ ఈ సినిమాకి. సో ఇన్ని అదనపు ఆకర్షణలున్న 'సంభవామి' సెన్సేషనల్‌ హిట్‌ అవడం ఖాయం. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS