'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత బన్నీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. కానీ, లేటైనా, లేటెస్ట్‌గా మూడు సినిమాలు లైన్‌లో పెట్టి రంగంలోకి దిగాడు. వాటిలో ఒకటి ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న సినిమా 'అల వైకుంఠపురములో' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది, ఇక తదుపరి బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్ - కనబడుటలేదు' సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆల్రెడీ ఓ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ని ఎంపిక చేసుకున్నారట. ఇక మెయిన్ హీరోయిన్‌ని బాలీవుడ్ నుండి దిగుమతి చేసే యోచనలో ఉన్నాడు బన్నీ. అందులోనూ తనకెంతో ఇష్టమైన అలియాభట్‌తో నటించాలనుకుంటున్నాడు. కానీ, అలియాభట్ ప్రస్తుతం చాలా బిజీ. ప్యాన్ ఇండియా డైరెక్టర్, టాలీవుడ్ మెగా మల్టీ స్టారర్ కాబట్టి రాజమౌళి సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటించేందుకు ఒప్పుకుంది. అఫ్‌కోర్స్ అందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోందనుకోండి. బన్నీ కూడా ఏం తక్కువ చేయడు. కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా బన్నీకి నో చెప్పిందట.
దాంతో బన్నీ కాంప్రమైజ్ కాక తప్పడం లేదు. బాలీవుడ్ భామనే తీసుకోవాలనుకుంటున్నాడు. అయితే, ఆల్రెడీ టాలీవుడ్‌కి ఈ భామ పరిచయం 'లోఫర్' సినిమాతో. ఆమె మరెవరో కాదు, దిశాపటానీ. సినిమాలు తక్కువే అయినా, దిశా పటానీకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సో దిశా పటానీకి బన్నీ మొగ్గు చూపుతున్నాడనే ప్రచారం బాగా జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమే అయితే, మెగా ప్రిన్స్‌తో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ, మళ్లీ మెగా కాంపౌండ్ హీరోతోనే రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలిక.