కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానేర్ లో 'రామ్ చరణ్ తేజ్' ప్రతిష్టాత్మకంగా నిర్మించిన...మెగాస్టార్ 'చిరంజీవి' 151వ చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ మధ్యే విడుదలయ్యి సినిమా పై అంచనాలని ఆకాశానికి ఏత్తేసింది. ఈ చిత్రం తోనే మెగా స్టార్ మల్లి బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరు కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
'సైరా' కథను దాదాపు 10 ఏళ్ల నుండి చిరు చేద్దమనుకున్నాడట...రిజల్ట్ ఎలా ఉంటాదో అనే అనుమానం తో ముందుకు సాగలేకపోయాడట. కానీ 'బాహుబలి' సినిమా రిజల్ట్ చూసాక కొండంత ధైర్యం వచ్చిందట. దాదాపు 300 కోట్లు ఖర్చు తో తీసిన 'సైరా' బడ్జెట్ తిరిగి వస్తుందన్న టెన్షన్ లేదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బాదులుగా చిరు.."బాహుబలి పుణ్యమా అంటూ నా 300 కోట్లు సేఫ్ గా కలెక్షన్స్ రూపంలో తిరిగి ఓచ్చేస్తాయి..నిజానికి 'బాహుబలి'ని ప్రేక్షకులు ఎలా స్వీకరించారో చూసాకే ఆ నమ్మకం మాకు వచ్చింది..దీనికి తోడు ఈ కథలో కూడా బాక్స్ ఆఫీస్ దెగ్గర వర్క్ ఔట్ అయ్యే కమెర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయ్'' అని చెప్పాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా, అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.