రియల్‌ హీరో అభినందన్‌ 'రీల్‌' సందడి.

మరిన్ని వార్తలు

పుల్వామా దాడి ఘటన తర్వాత ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత్‌ వాయు సేన పాక్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పాక్‌ విమానాలను తరిమికొట్టే క్రమంలో భారత్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ నడుపుతున్న విమానం కూలి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భూభాగంలో పడడం, పాక్‌ సైనికులు ఆయనను బంధీగా తీసుకుని నానా చిత్ర హింసలు పెట్టినా, ఏ క్షణంలోనూ ధైర్యం కోల్పోకుండా, మూడు రోజులు శత్రువుల చెరలో ఉండి, ఎట్టకేలకు సొంత భూభాగానికి చేరిన రియల్‌ హీరో అభినందన్‌ గురించి తెలియని వారుండరు.

 

దేశం మొత్తం ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధించింది. పాక్‌ చెరలో ఉన్న ఆ మూడు రోజులూ అభినందన్‌ ఎలా ఉన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో పాక్‌ భూభాగంలో అభినందన్‌ దిగాల్సి వచ్చింది? అంతకు ముందు జైషే ఉగ్రవాద దాడులు, పుల్వామా ఘటన.. ఇవన్నీ బేస్‌ చేసుకుని, త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతోందట.ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఈ సినిమాని నిర్మించనున్నాడట.

 

ఇటీవల ఆయన ప్రధాని నరేంద్రమోడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. కానీ, భారతీయ పౌరుడిగా, దేశభక్తిని నరనరాల నింపుకున్న వ్యక్తిగా మన భారత సాయుధ బలగాల శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలియచెప్పాలనీ, అభినందన్‌ వంటి రియల్‌ హీరో ధైర్య సాహసాలను ఈ సినిమా ద్వారా చూపించాలనుకుంటున్నాననీ వివేక్‌ ఒబెరాయ్‌ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేస్తానని ఆయన ప్రకటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS