బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ ఇంకోసారి తన స్టయిలింగ్‌తో కిర్రాక్ పుట్టించేసింది. హాటెస్ట్ లుక్స్‌తో, సూపర్బ్ స్టైలింగ్‌తో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకోవడం ఈ బ్యూటీకి కొత్తేమీ కాదు. ఈసారి ఈ బ్యూటీ అందాల విందుకి, ఓ అవార్డ్స్ ఫంక్షన్ వేదికయ్యిందంతే.! బాలీవుడ్ నుంచి బోల్డంతమంది అందాల భామలు ఈ ఈవెంట్లో హల్చల్ చేసినా, అందరి దృష్టీ దోచేసింది ఈ అందాల రాక్షసి.
అంతే మరి, పేరులోనే అందమైన ఊర్వశి వుంది కదా! ఆ లుక్స్, ఆ కాస్ట్యూమ్స్, ఆ స్టైలింగ్.. ఊర్వశి అన్నిట్లోనూ టాప్ క్లాస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇంతకీ ఈ బ్యూటీలో సెక్సప్పీల్ ఎక్కడ వుందో తెలుసా.? ఇంకెక్కడ, తన కళ్ళలోనే అని చెబుతుంటుంది ఊర్వశి రౌతేలా.
అవార్డ్స్ ఫంక్షన్లో హల్చల్ చేయడం ఎప్పుడూ కొత్తగానే వుంటుందనీ, ఈసారి ఇంకాస్త డిఫరెంట్‌గా సత్తా చాటానని చెబుతోన్న ఊర్వశి, అందం అంటే ఆటిట్యూడ్ అనీ, శారీరక అందం ఎలా వున్నా, మానసిక అందం చాలా ముఖ్యమైనదనీ క్లాస్ తీసుకుంటుందండోయ్. అందాల భామ కదా, ఏం చెప్పినా అందంగానే వుంటుంది మరి.