గ్లామ్‌ షాట్‌: బుసలు కొడ్తున్న సొగసుల నాగిని

By iQlikMovies - December 18, 2018 - 10:22 AM IST

మరిన్ని వార్తలు

మౌనీ రాయ్‌ పేరు చెప్పగానే 'నాగిని' గుర్తుకొస్తుంది. నాగిని టెలివిజన్‌ సిరీస్‌తో మౌనీ రాయ్‌ పేరు మార్మోగిపోయింది దేశమంతటా. ఇప్పుడీ భామ వెండితెరపై సత్తా చాటుతోంది. బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోన్న మౌనీ రాయ్‌, తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో ఇదిగో ఇలా బుసలు కొట్టే అందంతో సొగసులు ఆరబోసేసింది. సౌత్‌లో సత్తా చాటేందుకు కూడా సిద్ధమైన ఈ బ్యూటీ, 'కెజిఎఫ్‌' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కూడా చేసిందండోయ్‌. తెలుగులోనూ అవకాశాలొస్తే నటించడానికి సిద్ధమేనని చెబుతోంది ఈ అందాల నాగిని.

 

అయితే, రెమ్యునరేషన్‌ విషయంలో ఏమాత్రం తగ్గే ఉద్దేశ్యం ఈ భామకి లేదట. గ్లామురన్నప్పుడే అవకాశాలు దక్కించుకోవాలి.. డిమాండ్‌ వున్నప్పుడే రెమ్యునరేషన్‌ గట్టిగా సంపాదించెయ్యాలనే ఆలోచన బహుశా ఈ బ్యూటీకి ఒకింత ఎక్కువగానే వున్నట్టుంది. ఏదిఏమైనా, ఈ సొగసుల నాగినికి ముందు ముందు సౌత్‌లోనూ అవకాశాలు పోటెత్తుతాయేమో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS