సాయి పల్లవి మామూలమ్మాయ్‌ కాదండోయ్‌.!

మరిన్ని వార్తలు

తక్కువ సినిమాలతోనే సాయిపల్లవి ఎంత క్రేజ్‌ సంపాదించుకుందో, అంతగానే విమర్శలూ ఎదుర్కొందీ. అయితే తెలుగులో సాయిపల్లవి చేసిన మూడో సినిమా 'పడి పడి లేచె మనసు' సినిమా సాయి పల్లవిపై ఇంతవరకూ ఉన్న ఆ నెగిటివ్‌ క్లైమాట్‌ని మాయం చేసేసిందనే చెప్పాలి. ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు సాయి పల్లవి పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించదు అనే నెగిటివ్‌ కామెంట్‌ ఉంది. కానీ 'పడి పడి లేచె మనసు' సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం సాయి పల్లవి చాలా యాక్టివ్‌గా పాల్గొంటోంది. 

 

అంతేకాదు, సాయిపల్లవికి ఈ వీక్‌ ఒకేరోజు రెండు సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగులో శర్వా సినిమా కాగా, తమిళ్ లో ధనుష్‌తో 'మారి 2' సినిమా. ఈ రెండు సినిమాలూ సాయిపల్లవి కెరీర్‌లో ప్రాధాన్యత ఉన్నవే. సో రెండింటి ప్రమోషన్స్‌లోనూ సాయి పల్లవి పాల్గొనాల్సి వస్తోంది. దాంతో అటూ ఇటూ చాలా బాగా మ్యానేజ్‌ చేస్తోంది అంటూ ఆమెపై ఇప్పుడు పోజిటివ్‌ కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే హీరో శర్వానంద్‌ సాయి పల్లవిని ఓపెన్‌గా తెగ పొగిడేస్తున్నాడు. మంచి ఫ్రెండ్‌, మంచి కో ఆర్టిస్ట్‌. మంచి సో అండ్‌ సో.. అంటూ 'మంచి' ట్యాగ్‌ ఇచ్చేశాడు సాయి పల్లవికి. 

 

ఇదిలా ఉంటే, సాయిపల్లవి, శర్వానంద్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ చాలా చాలా బాగుందనే టాక్‌ ఉంది ఇంతవరకూ విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా. ఇలా సాయి పల్లవి పేరు ఇప్పుడు ఈ రకంగా మార్మోగిపోతోంది. చూడాలి మరి ఈ పేరు సినిమా విడుదలయ్యాక ఎలా ఉంటుందో. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'పడి పడి లేచె మనసు' సినిమా డిశంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS