జయలలిత బయోపిక్‌లో ఫైర్‌ బ్రాండ్‌ కంగనా.!

మరిన్ని వార్తలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటిస్తోంది. అదేంటీ.. జయలలిత బయోపిక్‌ ఆల్రెడీ నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందుతోంది కదా. అనుకుంటున్నారా.? ఇది ఇంకోటి. బాలీవుడ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. విజయ్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. 

 

ఎన్టీఆర్‌ బయోపిక్‌ని నిర్మించిన విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్‌ని విబ్రీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల 'మణికర్ణిక' సినిమాతో కంగనా రనౌత్‌ చేసిన రచ్చ సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది జయలలిత బయోపిక్‌ అంటే బోలెడన్ని వివాదాలు, సంచలనాలకు, కేరాఫ్‌ అడ్రస్‌. మరి అలాంటి బయోపిక్‌లో మన ఫైర్‌ బ్రాండ్‌ కంగనా నటిస్తోందంటే ఖచ్చితంగా ఈ చిత్రంతో మరో పెద్ద సంచలనానికి శ్రీకారం చుడుతున్నట్లే.

 

హిందీతో పాటు, తమిళ, తెలుగు తదితర భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి 'తలైవి' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. 'మణికర్ణిక'తో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్‌ స్క్రీన్‌ తన తడాఖా చూపించిన కంగనా, ఇప్పుడు తమిళ ప్రజల ఆరాధ్యదైవం అమ్మగా అభివర్ణించబడిన జయలలిత బయోపిక్‌ 'తలైవి'తో ఇంకెన్ని సంచలనాలకు వేదికవుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS