తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు... రియా చక్రవర్తి దొరకడంతో డ్రగ్స్ కేసులో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొణె ఇప్పటికే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పడు మెల్లమెల్లగా బాలీవుడ్ టాప్‌హీరోల పేర్లు కూడా ఈ కేసులో బయటకు వచ్చాయని టాక్. త్వరలోనే ఆ ముగ్గురు హీరోలూ ఎన్‌సీబీ ముందు హాజరు అవుతారన్న టాక్ వినిపిస్తోంది.
ఎస్, ఆర్, ఎ... అనే పేర్లు గల ముగ్గురు హీరోలు ఈ కేసులో బుక్కయ్యారని ముంబై మీడియా కోడై కూస్తోంది. ఈ ముగ్గురు హీరోలూ గతంలో దీపికా పదుకొణెతో కలిసి పనిచేశారని వినికిడి. ఎస్ ఎంటే ఎవరు? ఆర్ అంటే ఎవరు? ఏ అంటే ఎవరు? అంటూ ఆరా మొదలైందిప్పుడు. ఈ ముగ్గురికీ డ్రగ్స్ మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, ఈ ముగ్గురూ గతంలో డ్రగ్స్ వాడారన్న సమాచారం, అందుకు తగిన సాక్ష్యాలూ అధికారులు ఇప్పటికే సేకరించారని సమాచారం. మరి ఈ ముగ్గురు హీరోలూ ఎవరన్నది అధికారులే చెప్పాలి.