చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఆ వెంటనే 'లూసీఫర్' మొదలవుతుంది. సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. `సాహో`తో సుజిత్ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. బాలీవుడ్ లో `సాహో` బాగానే ఆడింది. అది `లూసీఫర్` కి కలిసొచ్చే అంశం. ఇప్పుడు ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా అజయ్ - అతుల్‌ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్లో ఈ సంగీత ద్వయానికి మంచి పేరుంది. అలా... కాస్త బాలీవుడ్ టచ్ ఈ సినిమాకి అబ్బబోతోంది. 'లూసీఫర్'లో కొన్ని ఇతర ముఖ్యమైన పాత్రలకు గానూ.. బాలీవుడ్ నటుల్ని ఎంచుకునే పయత్నాల్లో ఉంది చిత్రబృందం.
అలా.. ఈ సినిమాకి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా మలయాళం రీమేక్ కాబట్టి, ఆ భాషలో విడుదల చేసే అవకాశం లేదు. కనీసం తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అయినా లూసీఫర్ రీమేక్‌కి కొంత క్రేజ్ తీసుకురావాలనుకుంటున్నారు. సైరాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించాలనుకున్నాడు చిరు. కానీ.. ఆ సినిమా బాలీవుడ్ లో వర్కవుట్ అవ్వలేదు. అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్‌ని తీసుకొచ్చినా, బాలీవుడ్ లో వసూళ్లు సాధించలేకపోయింది సైరా. లూసీఫర్ రీమేక్ తో అయినా చిరు బాలీవుడ్ ని గెలుచుకుంటాడేమో చూడాలి.