'సింహా', 'లెజెండ్' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టి, త్వరలోనే హ్యాట్రిక్‌కి రెడీ అవుతోన్న కాంబినేషన్ బాలయ్య - బోయపాటి కాంబినేషన్. ఇటీవలే ఈ కాంబినేషన్లో మూవీని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ప్రస్తుతం 'రూలర్' సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య, తదుపరి బోయపాటి సినిమా కోసం సిద్దం కానున్నారు. 'రూలర్' పనుల్లో బాలయ్య బిజీగా ఉంటే, బోయపాటి తన సినిమాకి తెర వెనక కార్యకలాపాలను చకచకా చక్కబెట్టేస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' సినిమాలకు మించిన రేంజ్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. అందుకే ఈ సినిమా కోసం సరికొత్త ఫ్లేవర్ అద్దుతున్నారు.
బాలయ్యతో ఢీ కొట్టే విలన్, బాలయ్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోయే హీరోయిన్ విషయంలో బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్రెష్‌నెస్ కోసం బాలీవుడ్ తారాగణాన్ని టాలీవుడ్‌కి దించబోతున్నారనీ టాక్. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్‌తో విలన్ పాత్ర కోసం సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్యతో నటించేందుకు ఆయన సుముఖంగానే ఉన్నారట. అలాగే, హీరోయిన్గా సోనాక్షి సిన్హా పేరు వినిపిస్తోంది. ఇంతవరకూ కీర్తిసురేష్ పేరు బాగా వినిపించింది. కానీ, వరుస ప్రాజెక్టులతో కీర్తి బిజీగా ఉండడంతో, బాలీవుడ్ నుండి సోనాక్షిని తీసుకురానున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవన్నీ నిజమే అయితే, బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌కి బాలీవుడ్ ఫ్లేవర్ బాగా అద్దుతున్నట్లే.