ప‌వ‌న్‌కి తాత‌య్య‌.... బన్నీకి నాన్న‌!!

మరిన్ని వార్తలు

త్రివిక్ర‌మ్ సినిమాల్లో బొమ‌న్ ఇరానీ క‌నిపించ‌డం ఇప్పుడు మామూలైపోతోంది. `అత్తారింటికి దారేది` కోసం తొలిసారి బొమ‌న్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చారు త్రివిక్ర‌మ్‌. ఆ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి తాత‌య్య‌లా న‌టించారు బొమ‌న్‌. ఆ త‌ర‌వాత అజ్ఞాత‌వాసిలోనూ ఆయ‌న‌కు ఓ పాత్ర ద‌క్కింది. మ‌రోసారి బొమ‌న్‌ని టాలీవుడ్‌కి తీసుకొస్తున్నాడు త్రివిక్ర‌మ్‌.

 

అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం బొమ‌న్ ఇరానీని తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈసారి అల్లు అర్జున్‌ని ఆయ‌న నాన్న‌లా క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. బ‌న్నీ సినిమాలో క‌థానాయిక ఎవ‌ర‌న్న విష‌యంలోనూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఇంకా క‌థానాయిక‌ని ఫైన‌లైజ్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఈనెల‌లో ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్నారు. మార్చి నుంచి షూటింగ్ మొద‌లు కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS