సినిమా ఫ్లాప్ అయినా... 'మాది హిట్టేనండీ.. వసూళ్లు బాగానే ఉన్నాయి.. రివ్యూలే అలా వచ్చాయ్' అంటూ బిల్డప్పులిస్తుంటారు సినిమావాళ్లు. ఫ్లాప్ అయ్యిందని తెలిసినా.. సక్సెస్ మీట్లు పెడుతుంటారు. 'మెల్లిమెల్లిగా మా సినిమా పుంజుకుంటుంది' అంటూ కోతలు కోస్తారు. కానీ 'వినయ విధేయ రామ' విషయంలో ఇదేం జరగలేదు. ఈ సినిమా ఫ్లాప్ టాక్ రాగానే చిత్రబృందం కామ్ అయిపోయింది. సక్సెస్ మీట్లూ, టూర్లు... లాంటి ప్రయత్నాలేం చేయలేదు.
తాజాగా రామ్ చరణ్ సైతం 'మా సినిమా ఫ్లాప్ అయ్యింది' అంటూ పరోక్షంగా ఒప్పుకున్నాడు. అభిమానులకు ఓ లేఖ కూడా రాశాడు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం ఇంకా హిట్టు భ్రమల్లోనే ఉన్నాడని తెలుస్తోంది. 'నా సినిమా బాగానే ఉంది... కానీ రివ్యూలే నెగిటీవ్‌గా వచ్చాయ్' అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. రామ్‌చరణ్ లేఖ రాసిన విషయంలోనూ బోయపాటి అసంతృప్తితో ఉన్నాడని టాక్.
చరణ్ అలా లేఖ రాయాల్సింది కాదంటూ... ఫీల్ అవుతున్నాడట. పైగా చరణ్ రాసిన లేఖలో నిర్మాత డివివి దానయ్య పేరు ప్రస్తావించాడు గానీ, దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. దాంతో బోయపాటి మరింతగా నొచ్చుకుంటున్నాడని తెలుస్తోంది. పాపం.. బోయపాటి. ఇంకా ఈ సినిమా హిట్టనే భ్రమల్లోనే ఉన్నాడు. ఆ మబ్బులు ఎప్పుడు తొలగిపోతాయో..?