మా సినిమా ఇంత విజయం సాధించింది. అంత విజయం సాధించింది. ఇన్ని కోట్లు కొల్లగొట్టింది. అన్ని వసూళ్లు రాబట్టింది అంటూ చెప్పుకోవడం మామూలే. కొన్ని సందరాల్లో ఆ సినిమా విజయాన్ని కూడా తక్కువ చేసేలా ఎక్కువ మాటలు చెబుతుంటారు. అలా చేయడం వల్ల, ఆ అత్యుత్సాహం కారణంగా మంచి టాక్ వచ్చిన సినిమాలు కూడా నిర్మాతల్ని నష్టాల్లోకి నెట్టేస్తుంటాయి. అయితే కొందరు మాత్రం జెన్యూన్‌గా మాట్లాడుతుంటారు.
'రంగస్థలం' సాధించిన విజయం తర్వాత కొన్ని ఫేక్ రికార్డులు ప్రచారంలోకి రావడం రామ్ చరణ్‌ని నిరుత్సాహపరిచింది. తన తదుపరి సినిమాకి రికార్డుల ప్రస్థావన లేకుండా చేస్తానని అన్నాడు. మరోపక్క ఇటీవల విడుదలైన వినయ విధేయ రామ పరాజయాన్ని చవిచూసింది. నిర్మాతకు నష్టాన్ని మిగిల్చింది. మామూలుగా అయితే హీరోలు ఇలాంటి సందర్భాల్లో నోరు మెదపడం కష్టమే. చరణ్ మాత్రం పెదవి విప్పాడు.
కష్టపడి చేసినా, దురదృష్టవశాత్తూ ఆశించిన ఫలితం దక్కలేదనీ, మరింత కష్టపడి అభిమానుల్ని అలరిస్తామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇప్పుడీ ప్రకటన సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చరణ్, అభిమానుల మనసుల్ని గెలుచుకోవడమే కాదు, సినీ పరిశ్రమలో అందరి ఆకర్షించాడు. 'వినయ విధేయ రామ' తర్వాత డివివి దానయ్య నిర్మాణంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా చేస్తున్నాడు చరణ్. కనీ వినీ ఎరుగని డిజాస్టర్‌గా మారుతుందనుకున్నా, అనూహ్యంగా నష్టాన్ని తగ్గించుకోగల్గింది 'వీవీఆర్'. 63 కోట్లకు పైగా షేర్ లభించింది.
Thank you Mega Powerstar #Ramcharan for your constant support!
— DVV Entertainment (@DVVMovies) February 5, 2019
Dear audience, we will work even more harder and entertain you all with our future films. Thank you for the continuous encouragement! pic.twitter.com/VZUgGrqi9r