గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను ఓ సినిమా చేస్తున్నాడన్న వార్త మొన్ననే బయటకు వచ్చింది. అది అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా. అయితే... హీరో ఎవరన్నది మాత్రం చెప్పలేదు. సరైనోడు తరవాత బన్నీ - బోయపాటి కాంబోలో ఓ సినిమా వస్తుందని చాలా రోజుల నుంచీ ప్రచారం జరుగుతోంది. పైగా గీతా ఆర్ట్స్ లో ఓకే అయిన సినిమా కాబట్టి, అది కచ్చితంగా బన్నీ కోసమే అని అనుకొన్నారంతా. అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్. ఈ ప్రాజెక్ట్ బన్నీ కోసం కాదట. బాలయ్య కోసమట.
అవును... బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ కలిసింది బాలయ్య సినిమా కోసమే అంటూ మరో వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. గీతా ఆర్ట్స్ లో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నారని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. బాలయ్యకు తగిన కథల్ని కూడా గీతా ఆర్ట్స్ అన్వేషిస్తోంది. మరోవైపు అఖండ తరవాత బాలకృష్ణ - బోయపాటి కాంబో మళ్లీ సెట్ అవ్వాల్సివుంది. నిజానికి `భగవంత్ కేసరి` స్థానంలో బోయపాటి సినిమానే పట్టాలెక్కాలి. కానీ కుదర్లేదు.
బోయపాటికి బాలయ్యతో ఓ సినిమా బాకీ. గీతా ఆర్ట్స్‌కి బాలయ్య ఓ సినిమా బాకీ. ఈ రెండు బాకీలూ ఇలా ఈ ఒక్క సినిమాతో తీరిపోతున్నాయన్నమాట. సో.. బాలయ్య - బోయపాటి సినిమా ఆన్ అయిపోయినట్టే.