బోయపాటి ` బాలయ్య కాంబినేషన్ అంటే ‘సింహా’, ‘లెజెండ్’ రికార్డు హిట్స్ గుర్తొస్తాయి. ఇదే కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతోన్న సినిమా అంటే ఆ స్థాయి అంచనాలే నమోదవడం సహజమే. అయితే, ఈ మధ్య బాలయ్య సినిమాలు అంచనాలను తారుమారు చేస్తూ, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అందుకే 106వ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బోయపాటి చాలా పక్కాగా ఈ సినిమాకి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేశాడు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడట. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా లేటెస్ట్గా సెట్స్ మీదికెళ్లింది. ఫస్ట్ షాట్‌కే దిమ్మ తిరిగే యాక్షన్ ఘట్టాన్ని షూట్ చేసి, యూనిట్లో ఉత్సాహం నింపాడు బోయపాటి.
లిమిటెడ్ బడ్జెట్లోనే సినిమాని చాలా రిచ్‌గా ఫుల్ క్వాలిటీతో తెరకెక్కించాలనుకుంటున్నాడట బోయపాటి. మణిశర్మ అందిస్తున్న బాణీలు సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనున్నాయని అంటున్నారు. తెలుగమ్మాయ్ అంజలి ఓ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్‌కీ ఈ సినిమాలో చోటుందని తెలుస్తోంది. ఇకపోతే, ఈ సినిమాలోనూ బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో ఒకటి అఘోరా పాత్రనీ లీక్డ్ టాక్. ఈ పాత్ర కోసం బాలయ్య బాగా బరువు తగ్గారనీ తెలుస్తోంది. అఘోరా బ్యాక్ డ్రాప్లో రూపొందే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయంటున్నారు. చూడాలి మరి, ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి ద్వయం హ్యాట్రిక్ కొడితే, నందమూరి ఫ్యాన్స్‌కీ పండగే.