తనకు బాగా నచ్చిన దర్శకుడితో మరో సినిమా చేయడం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కి చాలా చాలా ఇష్టం. 'ధృవ' సినిమా చేస్తున్న టైమ్‌లోనే, దర్శకుడు సురేందర్‌రెడ్డితో మరో సినిమాకి ఓకే చేసేశాడు రామ్‌చరణ్. అలా సురేందర్‌రెడ్డిని, చిరంజీవి కలల ప్రాజెక్ట్ 'సైరా నరసింహారెడ్డి'కి దర్శకుడ్ని చేసిన మెగా పవర్ స్టార్, మరో మెగా ప్రాజెక్ట్‌ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ మెగా ప్రాజెక్ట్‌కి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుని దర్శకుడిగా ఖరారు చేశాడట. చిరంజీవి తదుపరి సినిమా బోయపాటి దర్శకత్వంలో రానుందనేది తాజా ఖబర్. నిజానికి, బోయపాటితో చిరంజీవి ఎప్పుడో సినిమా చేయాల్సి వుంది. కొన్ని కారణాలతో ఈ కాంబో ఆలస్యమయ్యింది. ప్రస్తుతం బోయపాటి, రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. చిరంజీవి హీరోగా నటించే సినిమాలకు దాదాపుగా చరణే నిర్మాతగా వుంటూ వస్తున్నాడు ఈ మధ్య.
తాను నిర్మాతనయితే, తన తండ్రిని ఇంకా బాగా ప్రమోట్ చేసుకోవడానికి వీలవుతుందని చరణ్ భావిస్తున్నాడేమో. 'ఖైదీ నెంబర్ 150' సినిమా చిరంజీవికి రీ-లాంఛ్ మూవీ లాంటిదే. రీ-ఎంట్రీలో చిరంజీవి 100 కోట్ల వసూళ్ళతో సత్తా చాటాడంటే, దాని వెనుక చరణ్ ప్లానింగ్ చాలా కీలక భూమిక పోషించింది.
'సైరా నరసింహారెడ్డి' లాంటి ప్రాజెక్ట్ చరణ్ మాత్రమే టేకప్ చేయగలడని అందరికీ నమ్మకం కలిగించగలిగాడు. అయితే, చిరంజీవి తదుపరి సినిమా కోసం నిర్మాత అల్లు అరవింద్ కర్చీఫ్ వేశారని సమాచారమ్. బోయపాటికీ అల్లు అరవింద్‌కీ మంచి సంబంధాలే వున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ కొణిదెల బ్యానర్, అల్లు అరవింద్ గీతా బ్యానర్ కలిసి చిరంజీవి సినిమాని నిర్మించే అవకాశాలూ లేకపోలేదు.