సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ గత కొంత కాలంగా కెరీర్ పరంగా చాలా ఇబ్బందులే పడుతున్నాడు. అయితే ఆ పరాజయాల వెనుక ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం అని సర్వత్రా వ్యక్తమైన అభిప్రాయం.
ఇక ఆయన గతకొంతకాలంగా మీడియాకి అలాగే ఆయన అభిమానులకి కనపడటంలేదు. అయితే ఇంతకి సాయి ధరం తేజ్ ఇప్పుడు ఇండియాలో లేడట, రెండు మూడు నెలలుగా ఆయన అమెరికాలో ఉన్నాడని సమాచారం. ఇంతకి ఆయన అమెరికా వెళ్ళడానికి కారణం గల కారణం- బరువు తగ్గడానికి లైపో ద్వారా చికిత్స తీసుకుంటున్నాడట.
సాయి ధరం అమెరికా నుండి వచ్చిన వెంటనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
మరి ఈ లైపో చికిత్స తరువాత ఆయన నూతనోత్సాహంతో మంచి సినిమాల్లో నటించి మరోసారి సక్సెస్ సాధించాలని కోరుకుందాము..