కొన్ని కాంబినేషన్లు వెండి తెరపై చూడాలని అభిమానులే కాదు, చిత్రసీమ కూడా పరితపించిపోతుంటుంది. ఆ కాంబినేషన్ ఎప్పుడు సెట్టవుతుందా అని కలలు కంటుంటుంది. అలాంటి కాంబినేషన్ చిరంజీవి - బోయపాటి శ్రీనులది. చిరు రీ ఎంట్రీ కి తగిన కథల కోసం వెదుకుతున్న సందర్భంలోనే బోయపాటి శ్రీను కూడా ఓ కథ చెప్పారు. `సైరా` తరవాత చిరు- బోయపాటి కాంబో సెట్స్‌పైకి వెళ్తుందని కూడా ప్రకటించారు. ఆ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత.
కానీ.. లెక్కలు మారిపోయాయి. `సైరా` తరవాత.. కొరటాల శివకు ఫిక్సయ్యాడు చిరు. ఈ లైన్‌లోనే చాలా సినిమాలు ఒప్పుకున్నాడు.కానీ అందులో బోయపాటి సినిమా లేదు. దాంతో బోయపాటి తో చిరు సినిమా లేనట్టే అనుకున్నారంతా.కానీ.. బోయపాటి మాత్రం తన ప్రయత్నాలు మానలేదు అని తెలుస్తోంది. చిరుతో సినిమా చేయడానికి బోయపాటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని, చిరుకి టచ్‌లోనే ఉన్నాడని తెలుస్తోంది. గతంలో చిరుకి వినిపించిన లైన్ పై బోయపాటి వర్క్ చేస్తున్నాడని, ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడైనా సరే, ఈ కాంబోలో సినిమా ఉండొచ్చన్నది విశ్వసనీయ వర్గాల టాక్.