రామ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓసినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. దీన్ని ఓ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందిస్తున్నారు. `అఖండ` తరవాత బోయపాటి శ్రీను చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకి డబ్బుల్లేవని టాక్. దానికి రామ్ నటించిన `ది వారియర్`నే కారణం.
రామ్ - లింగుస్వామి కాంబినేషన్‌లో `ది వారియర్` రూపుదిద్దుకొని ఇటీవలే విడుదలైంది. ఈసినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఇప్పుడు ఆయనే బోయపాటి శ్రీను సినిమాకి నిర్మాత. వారియర్‌తో తీవ్ర నష్టాల పాలైన శ్రీనివాస్ చిట్టూరి.. ఇప్పుడు మళ్లీ రామ్ సినిమా కోసం అంత బడ్జెట్ పెట్టలేనని అంటున్నార్ట. ఈ సినిమా బడ్జెట్ తగ్గించుకోవాలని, లేదంటే సినిమా చేయలేనని చేతులు ఎత్తేసినట్టు టాక్.
బోయపాటి శ్రీను వెనక్కి తగ్గే రకం కాదు. తను అనుకొన్నది అనుకొన్నట్టు తీస్తాడు. అందుకే బడ్జెట్ తగ్గించుకోవడానికి బోయపాటి ఏమాత్రం ఇష్టపడడని, కావాలంటే మరో నిర్మాతని ఈ సినిమా కోసం జాయింట్ చేస్తాడని చెప్పుకొంటున్నారు. బోయపాటి తో సినిమా అంటే చాలామంది నిర్మాతలు క్యూ లో ఉంటారు. కాబట్టి ఈసినిమా జాయింట్ వెంచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.