కలిసి బ్రతకలేనప్పుడు విడిపోయి సంతోషంగా ఉండడం అనేది ఈ రోజుల్లో తరుచుగా వినిపిస్తున్న మాట. ఈ మాటకి సెలబ్రిటిలు కూడా అతీతం కాదు.
అలా విడిపోవడానికి సిద్ధం అయింది ఓ సెలబ్రిటీ జంట. వివరాల్లోకి వెళితే, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కొడుకు 2013లో పెద్దల్ని ఒప్పించి ఇంద్రాక్షి రాయి పట్నాయక్ అనే ఫ్యాషన్ డిజైనర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంద్రాక్షి అనతి కాలంలోనే పెద్ద డిజైనర్ గా పేరు తెచ్చుకుంది.
అయితే కారణాలు తెలియవు గాని, భార్య భర్తలు ఇద్దరు కొద్దికాలంగా వేరుగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి, నటుడు బ్రహ్మాజీ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ద్రువికరించారు. త్వరలోనే ఇద్దరు విడాకులు తీసుకుంటారని, ఈ సమయంలో వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వమ్మని అందరికి విజ్ఞప్తి చేశాడు.
ఈ వార్త తెలిసాక అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే వీరి మధ్య విడాకులు తీసుకునేంతగా ఏం జరిగింది అన్నవిషయం మాత్రం తెలియరాలేదు.