'బ్రాండ్‌ బాబు' బ్రాండ్‌ ప్రొడక్షన్స్‌

By iQlikMovies - July 30, 2018 - 15:28 PM IST

మరిన్ని వార్తలు

సుమంత్‌ శైలేంద్ర హీరోగా తెరకెక్కిన చిత్రం 'బ్రాండ్‌ బాబు'. బుల్లితెర ఆర్టిస్ట్‌ ప్రభాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా హీరో సుమంత్‌ శైలేంద్ర విషయానికి వస్తే, ఈ బ్రాండ్‌ బాబు కేవలం హీరో మాత్రమే కాదట. నిర్మాత కూడా. తొలి చిత్రాన్ని సొంత నిర్మాణంలో రూపొందిస్తున్నాడు. 

అలాగే తదుపరి చిత్రానికి కూడా తానే నిర్మాతగా వ్యవహరిస్తాడట. అయితే ఈ సినిమాలో తాను నటించడట. కానీ హీరోయిన్‌గా ఈషా రెబ్బని తీసుకుంటానని మాటిచ్చాడీ యంగ్‌ హీరో. అయితే ఇక హీరోగా సినిమాలు చేయడా అంటే కాదట. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, నిర్మాతగానూ అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తాడట. కొన్నింటిలో తాను నటిస్తాడట. మరికొన్నింటిని ఇతర హీరోలతో నిర్మిస్తాడట. అలాగే త్వరలో తన సొంత నిర్మాణంలో రూపొందించబడే సినిమాకే ఈషా రెబ్బని హీరోయిన్‌గా తీసుకుంటానని మీడియా ముఖంగా ఈ ముద్దుగుమ్మకి మాటిచ్చేశాడీ యంగ్‌స్టర్‌. 

ఇకపోతే 'బ్రాండ్‌బాబు' విషయానికి వస్తే, ఈ సినిమాకి డైరెక్టర్‌ మారుతి కథ అందించారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ కూడా ఆయనవే. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. గుత్తి వంకాయకు కూడా బ్రాండ్‌ వెతికే ఈ ప్రబుద్ధుడు ఓ పేదింటి పిల్ల లవ్‌లో పడితే ఎలా ఉంటుంది? అదే ఈ సినిమా స్టోరీ. మారుతి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS