ఎన్టీఆర్ అరవింద సమేత మరో లీక్

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ అరవింద సమేతకి లీకుల తలనొప్పులు ఇప్పుడిప్పుడే తప్పేలా కనిపించట్లేదు. ఎందుకంటే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఒకటి లీక్ అవ్వడం జరిగింది.

ప్రస్తుతం ఆ లీక్ అయిన ఫోటో ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తున్నది. తెల్లటి కుర్తా, నీలం జీన్స్ లో ఒక యాంగ్రీ లుక్ లో ఉన్న ఎన్టీఅర్ ని ఆ లీక్ అయిన స్టిల్ లో చూడొచ్చు. మొన్ననే ఎన్టీఆర్, నాగబాబు ఉన్న ఒక స్టిల్ బయటకిరావడంతో యూనిట్ షాక్ అవ్వడంతో పాటుగా మరో లీక్ అవ్వకుండా చూడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అయితే ఈ తాజా లీక్ తో వారి కట్టుదిట్టం చేసిన చర్యలు సరిపోలేదు అని అర్ధమవుతుంది. ఏదేమైనా ఇటువంటి లీకులు చిత్ర యూనిట్ కి పెను సవాలుగా మారింది. మరి ఇప్పటికైనా వారు తీసుకుంటున్న చర్యల తీవ్రతని పెంచుతారని ఆశిద్దాం...

ఇక సినిమా విషయానికి వస్తే, దసరాకి అరవింద సమేతని థియేటర్స్ లో ఉంచాలని దర్శక-నిర్మాతలు కష్టపడుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS