ఈ రోజు విడుదలైన సినిమాల్లో '4 లెటర్స్' అనే చిన్న మూవీ ఉన్న సంగతి తెలిసిందే. తెలియకుండా ఎలా.? ఇదే రోజు విడుదలవుతున్న సినిమాల్లో ఏ సినిమాకీ లేనంత పబ్లిసిటీ ఈ సినిమాకి జరుగుతోంది మరి. ఇకపోతే టైటిల్‌లో ఉన్న '4 లెటర్స్'కి ఫోర్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయట. ఆ ఫోర్ లెటర్స్‌కి రిలేటెడ్‌గా క్యారెక్టర్స్ డిజైన్ చేయబడ్డాయట.
ఒకరికి 'రిచ్' (ఇంగ్లీష్‌లో నాలుగక్షరాలు) అంటే ఇష్టముండదట. ఇంకొకరికి 'పూర్ (ఇంగ్లీష్‌లో నాలుగక్షరాలు), మరొకొరికి 'ఫెయిల్' (ఇది కూడా నాలుగక్షరాలే) అంటే నచ్చదంట. ఇంకో వర్డ్ ఉందట. అయితే అది మాత్రం సినిమాలోనే చూడాలట. ఇలా ఈ నాలుగక్షరాల కనెక్షన్‌తో '4 లెటర్స్' మూవీని తెరకెక్కించారు. ఈ సంగతిటుంచితే, అసలీ సినిమా అడల్ట్ మూవీనే కాదంటున్నారు చిత్ర యూనిట్. యూత్‌ని ఎట్రాక్ట్ చేసేందుకే ట్రైలర్‌ని కాస్త ఘాటుగా, హాట్‌గా కట్ చేశాం.
కానీ సినిమాలో ఓ బెస్ట్ థీమ్ దాగుందని చెబుతున్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా ఉంటుందట. ఈశ్వర్, తుయా చక్రవర్తి, అంకెతా మహారాణా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి రఘురాజ్ దర్శకుడు. ఒక్క మాట.. 'లవ్ బ్రేకప్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలటండోయ్..' ఇంకేం లవ్‌లో ఉన్నవాళ్లంతా ఈ సినిమాని మర్చిపోకుండా, మిస్ కాకుండా చూసెయ్యండిక.