దిల్‌రాజు స్థానంలో... మ‌హేష్ బాబు

మరిన్ని వార్తలు

ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు మ‌హేష్ బాబు. ఆ త‌ర‌వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సివుంది. కానీ సుకుమార్ క‌థ రెడీ చేసుకోక‌పోవ‌డంతో ఆ అవ‌కాశం అనిల్ రావిపూడి చేతిలోకి వెళ్లింది. ఈ చిత్రానికి అనిల్ సుంక‌ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, దిల్‌రాజు కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. 

 

అయితే.. ఈ సినిమాకి మ‌రో నిర్మాత దిల్‌రాజు కాద‌ట‌. మ‌హేష్ బాబునే న‌ట‌. అవును.. ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్‌కీ దిల్‌రాజుకీ ఎలాంటి సంబంధం లేద‌ని తేలిపోయింది. ఈ సినిమాలో వాటా తీసుకున్న‌ది దిల్ రాజు కాద‌ని, మ‌హేష్ బాబునే ప్రొడ‌క్ష‌న్‌లో భాగ‌స్వామ్యం తీసుకున్నాడ‌ని టాక్‌. మ‌హేష్ పారితోషికం దాదాపు 25 కోట్ల వ‌ర‌కూ ఉంది. 

 

ఆ పారితోషికం బ‌దులుగా మ‌హేష్ సినిమా లాభాల‌లో వాటా తీసుకోవ‌డానికి ముందుకొచ్చాడు. అనిల్ సుంకర‌తో మహేష్‌కి మంచి అనుబంధం ఉంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మూడు సినిమాలొచ్చాయి. అందుకే.. అనిల్ సుంక‌ర కూడా మ‌హేష్ భాగ‌స్వామిగా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS