స్టైలిష్ స్టార్ బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా ఇండస్ట్రీ రికార్డు హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన అసలు సిసలు సినిమాగా ఈ సినిమా బన్నీ కెరీర్‌లో సూపర్ హిట్‌గా మిగిలింది. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత బన్నీ ఓ నిర్ణయానికి వచ్చాడట. ఇకపై తన సినిమాలకు ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, రికార్డు కలెక్షన్స్, వంద కోట్ల క్లబ్‌లు .. వంటి డప్పు కొట్టుకోవడం మానేయాలని డిసైడ్ అయ్యాడట. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్థారు.. అన్న తృప్తి ముందు, ఈ డప్పుల గోల ఎంత ఎక్కువైనా తక్కువే అంటున్నాడు బన్నీ.
ఆల్రెడీ మెగా కాంపౌండ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ రికార్డు డప్పుల గోల కు ఎప్పుడో బ్రేకప్ చెప్పేశాడు. తన సినిమా పోస్టర్స్‌పై బ్లాక్ బస్టర్ హిట్స్, ఆల్ టైమ్ రికార్డ్ హిట్స్ లాంటివి కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక వసూళ్ల లెక్కయితే ఎప్పుడూ బయటపెట్టడు రామ్‌చరణ్. ‘రంగస్థలం’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ హిట్ అన్న సంగతి తెలిసిందే. కానీ, ఫైనల్‌గా ఎంత మేర కలెక్షన్లు రాబట్టిందన్న అధికారిక రిపోర్ట్ ఇంతవరకూ బయటికి రాలేదు. ‘సైరా’ విషయంలోనూ ఇదే తీరును కంటిన్యూ చేశాడు రామ్‌చరణ్. ఇప్పుడు ఇదే బాటలో బన్నీ కూడా నడవనున్నాడన్న మాట. హీరో మధ్యా, సినిమా మధ్యా పోటీ ఆరోగ్యకరంగా ఉండాంటే, ఈ మెగా హీరోల దారే సరైనది.. అంటూ కొందరు వీరి నిర్ణయాల్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నారు.