‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ లవర్స్ డేకి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంతవరకూ ఈ సినిమాపై అంతగా బజ్ లేనప్పటికీ, రిలీజ్ దగ్గర పడ్డాకా విజయ్ జోరు పెంచేశాడు. ప్రమోషన్స్‌లో హుషారుగా పాల్గొంటున్నాడు. ఊపందుకున్న ప్రమోషన్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ హడావిడిగా జరుగుతున్నాయి. ఈ హంగామా చూస్తుంటే, విజయ్ కెరీర్‌లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
లవ్ స్టోరీస్‌ని హృద్యంగా తీయగల టాలెంట్ ఉన్న డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో కంటెంట్ పైనా ఓ మోస్తరు క్లారిటీ ఉంది ఆడియన్స్‌లో. అంతేకాదు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్ల (రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె, కేథరీన్) గ్లామర్, మాస్ ఆడియన్స్‌ని బాగా టెంప్ట్ చేసేలా ఉంది. ఇక సినిమా నిండా కావల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడంతో, సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం ఖాయమే అంటున్నారు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో సంచనాలు సృష్టించిన విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ మంచి కమర్షియల్ హిట్‌ని అందించింది.
ఆ తర్వాత విడుదలైన ‘ట్యాక్సీవాలా’ కూడా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకుంది. కానీ, ‘డియర్ కామ్రేడ్’ మాత్రం బాక్సాఫీస్‌ని బాగా నిరాశపరిచింది. ఆ లోటు అంతా ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో తీర్చేస్తానన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది విజయ్ దేవరకొండలో చూడాలి మరి, ఆ నమ్మకాన్ని విజయ్ నిబెట్టుకుంటాడో లేదో.