‘బుట్టబొమ్మ’గా కుర్రోళ్ల మదిలో ఊయలలూగుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఇప్పుడు డార్లింగ్ ప్రబాస్‌తో రొమాన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అదేనండీ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రబాస్ నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది కదా.. ప్రస్తుతం హీరో, హీరోయిన్స్ అయిన ప్రబాస్ ` పూజా హెగ్దేపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందట. హైద్రాబాద్‌లో ఓ భారీ సెట్‌లో ఏర్పాటు చేసిన రొమాంటిక్ లొకేషన్ వీరిద్దరి రొమాన్స్‌కీ వేదికైందట. ఓ అందమైన చెరువు, ఆ చెరువులో ఓ పడవ.. చుట్టూ గ్రీనరీ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సెట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డిజైనర్ రవీందర్ ఈ అందమైన సెట్‌ని రూపొందించారు.
యూరప్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలకే ప్రాధాన్యమిచ్చిన ప్రబాస్, ఈ సినిమా బడ్జెట్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నాడట. ఏమాత్రం రాజీ పడకుండా ప్రొడక్షన్ టీమ్‌ని ఎప్పటికప్పుడే అలర్ట్ చేస్తున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఆచి తూచి సెట్స్‌ని రూపొందిస్తున్నారట. అయితే, లిమిటెడ్ బడ్జెట్‌లోనే అబ్బురపరిచే సెట్స్ రూపొందిస్తున్నారట ఆర్ట్ డిజైనర్ రవీందర్. సినిమాకి ఆ సెట్సే హైలైట్ అవుతాయంటున్నారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి ఇంతవరకూ ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, తాజాగా ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే కొత్త టైటిల్స్ తెర పైకి వచ్చాయి.