ఫైనల్లీ బన్నీ - త్రివిక్రమ్‌ క్లాప్‌ కొట్టేశారు.!

By Inkmantra - April 13, 2019 - 16:37 PM IST

మరిన్ని వార్తలు

ఇదిగో అదిగో అంటూ న్యూ ఇయర్‌ డే నుండీ వాయిదాలు పడుతూ వస్తున్న బన్నీ సినిమా ఎట్టకేలకు లాంచింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 24 నుండి సినిమా రెగ్యులర్‌ షూట్‌ జరుపుకోనుంది. గీతా ఆర్ట్స్‌, హారికా హాసినీ బ్యానర్‌లలో అల్లు అరవింద్‌, చినబాబు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'నాన్న నేను' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 

 

నాన్న సెంటిమెంట్‌ ప్రధానాంశంగానే కథ నడవడంతో, ఈ సినిమాని 'నాన్నకు ప్రేమతో' సినిమాకి సీక్వెల్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో త్రివిక్రమ్‌తో బన్నీ నటించిన 'జులాయి' ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ అయితే, రెండో సినిమా 'సన్నాఫ్‌ సత్యమూర్తి' నాన్న సెంటిమెంట్‌తో రూపొందిందే. ఈ రెండు సినిమాలూ మంచి విజయాలు అందుకున్నాయి. సో ఈ సారి సెంటిమెంట్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమపాళ్లలో మిక్స్‌ చేసి కమర్షియల్‌ అంశాల్ని పుష్కలంగా దట్టించి త్రివిక్రమ్‌ స్క్రిప్టు ప్రిపేర్‌ చేశాడట. 

 

ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వానీ పేరు వినిపించింది. కానీ పూజా హెగ్డే పేరును అధికారికంగా ప్రకటించారు. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు ఈ సినిమాకి. ఇకపోతే ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా బన్నీ మరో కొత్త సినిమాని టైటిల్‌తో సహా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఐకాన్‌ - కనబడుటలేదు' అనే టైటిల్‌తో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడట బన్నీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS