చిత్రలహరి: మెగా మేనల్లుడు దున్నేస్తున్నాడులే.!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ లేటెస్ట్‌గా 'చిత్రలహరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బజ్‌ బాగానే వినిపించింది. అందుకు తగ్గట్లుగానే విడుదలయ్యాక కూడా సినిమా మంచి టాకే తెచ్చుకుంది. ఇక ఓవర్సీస్‌లో అయితే వీర కుమ్ముడు కుమ్మేస్తున్నాడట మెగా మేనల్లుడు. అక్కడ మంచి వసూళ్లు రాబడుతోందని రిపోర్ట్స్‌ అందుతున్నాయి. 

 

ఈ మధ్య ఓవర్సీస్‌లో మంచి టాక్‌ తెచ్చుకున్న సినిమాలు కూడా పెద్దగా లేవు. సో అక్కడ మెగా మేనల్లుడు 'చిత్రలహరి'తో బోణీ కొట్టాడనుకోవాలి. నెక్స్ట్‌ ఓవర్సీస్‌ కింగ్‌ మహేష్‌బాబు రంగంలోకి దిగనున్నాడు 'మహర్షి'తో. తేజు బోణీ అదిరింది కాబట్టి మహర్షి కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకునే కళ కనిపిస్తోంది. ఇకపోతే 'చిత్రలహరి' విషయానికి వస్తే, వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న తేజు 'చిత్రలహరి'తో ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. 

 

ఓవర్సీస్‌లో అనూహ్యంగా భారీ వసూళ్లు రాబడుతోన్న 'చిత్రలహరి'ని ఈ సమ్మర్‌కి మెగా విజయంగా అభివర్ణిస్తున్నారు. చూడాలి మరి 'మజిలీ'తో స్టార్ట్‌ అయిన బాక్సాఫీస్‌ విజయ పరంపరను తేజు 'చిత్రలహరి'తో కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కూడా కొనసాగాలని ఆశిద్దాం. వచ్చే వారం నాని 'జెర్సీ'తో రానున్నాడు. ఈ సినిమాకీ ప్రీ రిలీజ్‌ టాక్‌ బాగానే ఉంది. చూడాలి మరి వసూళ్ల కళ ఎలా ఉండబోతుందో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS