బుర్రకథ అంటే ఓ కళ. కానీ మనం చెప్పుకునే బుర్రకథ అది కాదులెండి. ఇది పూర్తిగా వేరే. రెండు బుర్రల కథ ఇది. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం. లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో కథా కంటెంట్ బాగానే రివీల్ చేశారు. ఎవరికైనా ఒక శరీరం, ఒకే బుర్ర ఉంటుంది కానీ, ఈ సినిమాలో మన హీరోకి రెండు బుర్రలుంటాయి కానీ, శరీరం ఒక్కటే. దాంతో డబుల్ రోల్ ప్లే చేస్తుంటాడన్న మాట. ఒక బుర్ర సాత్వికంగా ఆలోచించమంటే, ఇంకో బుర్ర యూత్ ఐకాన్‌లా ఉండమంటుంది.
అదే ఆది 'బుర్రకథ' సారాంశం. ఇలా టూ డైమన్షియల్ బుర్రలతో కంటెంట్‌ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో నింపేశారు. ఇద్దరు హీరోయిన్స్‌ని పెట్టి గ్లామర్ కూడా పుష్కలంగా ఒలకబోయించారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రెండు డిఫరెంట్ పాత్రల్లో ఆది చక్కగా నటించారు. 'లవ్లీ' తరహాలో ఆది సాయి కుమార్‌కి ఈ సినిమా మంచి విజయం అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ, ఇంచుమించు ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన 'సవ్యసాచి' జనానికి ఎందుకో పెద్దగా ఎక్కలేదు. మరి ఆది స్టోరీ ఎక్కుతుందా.? అంటే ఏమో చెప్పలేం. టైమ్ బాగుంటే, ఎక్కేయొచ్చు. 'సవ్యసాచి'కి మించిన కామెడీ టైమింగ్ ఉండడంతో, ఆది టైమ్ బాగుంటే 'బుర్రకథ' ఆడియన్స్ మెచ్చే కథవడంలో అతిశయోక్తి ఏముంది.