'ఇస్మార్ట్‌'గా షాకిచ్చిన వరల్డ్‌ కప్‌!

మరిన్ని వార్తలు

ఐసీసీ వరల్డ్‌ కప్‌లో వరుస విజయాలు అందుకుంటూ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఫైనల్‌ దిశగా పరుగులు పెడుతోంది. ఆ క్రమంలో జూలై 14న వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరగనుంది. ఈ మాట ఇలా కాస్సేపు పక్కన పెట్టండి. కానీ, గుర్తు అట్టేపెట్టుకోండి. ఇప్పుడే వచ్చేద్దాం చిటికెలో. డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌, ఎనర్జిటిక్‌ రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా ఉంది కదా. ఆ సినిమాని జూలై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.

 

అయితే, అప్పటికింకా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ కాలేదుగా. కానీ, ఇప్పుడు ఆ డేట్‌ ఫిక్సయ్యింది. సో మన ఇస్మార్ట్‌ శంకర్‌ టీమ్‌ సో స్మార్ట్‌ కదా. అందుకే స్మార్ట్‌గా ఆలోచించేసి, తమ సినిమా విడుదలను కాస్త వెనక్కి పెట్టుకున్నారు. ఎందుకొచ్చిన తంటాలే అనుకున్నారు కాబోలు. ఎంతైనా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కదా. ఎంత కాదన్నా ఆ ఫీవర్‌ అందరికీ ఎఫెక్ట్‌ అవుతుంది. ఇప్పుడు అర్ధమైంది కదా. ఇస్మార్ట్‌ శంకర్‌కీ, వరల్డ్‌ కప్‌కీ లింకు.

 

హా.. అందుకే ఈ లింకుతోనే 'ఇస్మార్ట్‌ శంకర్‌' రిలీజ్‌ డేట్‌ జూలై 18కి జరిగింది. అసలే ఇస్మార్ట్‌ శంకర్‌ అంచనాల మీదున్నాడు. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ల డబుల్‌ గ్లామర్‌.. రామ్‌ డబుల్‌ స్టైలింగ్‌.. పక్కా హైద్రాబాదీ డబుల్‌ మాస్‌.. ఇలా ఒక్కటేంటీ.. ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ హైప్‌ డబుల్‌ అనే స్థాయిలోనే ఉంది. సో ఇస్మార్ట్‌ టీమ్‌ ఇస్మార్ట్‌ డెసిషన్‌.. కీప్‌ ఇట్‌ అప్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS