స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ పూజా హెగ్దే జంటగా నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురములో..'. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మూడు పాటలూ సక్సెస్ ఫుల్‌గా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశాయి. ఇక నాలుగో సాంగ్ టీజర్ రేపు అనగా డిశంబర్ 24న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు 'అల..' టీమ్. 'బుట్టబొమ్మ..' అంటూ సాగే ఈ సాంగ్ టీజర్ గురించి చెబుతూ, రిలీజ్ చేసిన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
పోస్టర్‌కే రెస్పాన్స్ ఇలా ఉంటే, ఇక సాంగ్ టీజర్‌ని ఎలా ప్లాన్ చేసి ఉంటారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇంతవరకూ విడుదల చేసిన మూడు సాంగ్స్‌నీ సమ్‌థింగ్ స్పెషల్‌గానే వదిలారు. ఈ సాంగ్ టీజర్‌ని కూడా అంతకు మించి అనే రేంజ్‌లోనే వదులుతారని ఆడియన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బుట్టబొమ్మ అన్నందుకు అచ్చు బుట్టబొమ్మలానే కనిపిస్తున్న పూజా హెగ్దే అందాన్ని వెనక నుండి ఆరాధిస్తున్నట్లు కనిపిస్తున్న అల్లు అర్జున్.. పోజు మెలోడియస్ రొమాంటిక్ అప్పీల్ ఇస్తోంది. సాంగ్ కూడా అంతే మెలోడియస్‌గా రొమాంటిక్‌గా ఉంటుందేమో చూడాలిక. తమన్ సంగీత సారధ్యంలో అర్మాన్ మాలిన్ గాత్రంతో, రామ జోగయ్య శాస్త్రి స్వర రచనలో ఈ పాట రూపుదిద్దుకుంది.