బుట్టబొమ్మా ఊపేస్తోందమ్మా.!

మరిన్ని వార్తలు

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'అల వైకుంఠపురములో..' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌తో ఊదరగొట్టేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే సాంగ్‌ టీజర్స్‌, లిరికల్‌ సాంగ్‌ వీడియోలతో అదరహో అనిపించారు. లేటెస్ట్‌గా విడుదల చేసిన 'బుట్టబొమ్మ..' సాంగ్‌ రిహార్సల్‌ టీజర్‌ ఒకటీ, 'సామజవరగమనా..' సాంగ్‌ ప్రోమో ఒకటి యూ ట్యూబ్‌లో సెన్సేషనల్‌ అవుతున్నాయి. ఇంతవరకూ ఈ సాంగ్స్‌కి సంబంధించి లిరికల్‌ వీడియోలు మాత్రమే రిలీజ్‌ చేశారు.

ఇవే యూ ట్యూబ్‌ వేదికగా సంచలన రికార్డులు సాధించగా, ఇక లేటెస్ట్‌ ప్రోమోస్‌ సినిమాపై అంచనాల్ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లిపోయాయి. 'సామజవరగమనా..' సాంగ్‌ ప్రోమోలో అల్లు అర్జున్‌ స్టైల్‌, పూజా హెగ్దే క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ అప్పీల్‌ ఈ ప్రోమోకి మెయిన్‌ అట్రాక్షన్‌గా నిలవగా, 'బుట్టబొమ్మా..' సాంగ్‌లో పొట్టి గౌనులో పూజా హెగ్దే చేస్తున్న డాన్సింగ్‌ స్టెప్పులు అచ్చు డాన్సింగ్‌ డాళ్‌ని తలపిస్తూ, కుర్రకారును కైపెక్కిస్తున్నాయి. టోటల్‌గా ఈ రెండు సాంగ్‌ ప్రోమోలు ఇప్పుడు యూత్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్‌ హీరోలు నవదీప్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, కీలక పాత్రలు పోషిస్తుండగా, సీనియర్‌ నటి టబు మరో ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS