ఆ రియలిస్టిక్‌ మూవీలో సమంత?

మరిన్ని వార్తలు

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనమైన 'దిశ' ఘటనను ఆధారంగా చేసుకొని సినిమా తెరకెక్కించాలని చాలా మంది డైరెక్టర్లు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే సంఘటనపై తమిళ దర్శకుడు శరవణన్‌ కూడా ఓ కథ సిద్ధం చేశారట. ఆ కథలో లీడ్‌ రోల్‌ పోషించేందుకు ఓ స్టార్‌ హీరోయిన్‌ కోసం వెతుకున్నారట. ఆ హీరోయిన్‌ తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌డమ్‌ ఉన్నవారిని ఎంచుకోవాలని చూస్తున్నారట. ఆ క్రమంలో సమంత పేరు తెరపైకి వచ్చింది. ఇంతకు ముందే ఈ ఘటన ఆధారంగా తెరకెక్కబోయే సినిమా కోసం సమంత పేరు వినిపించింది.

 

అయితే, శరవణన్‌ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో నటించేందుకు అయితే సమంత దాదాపు సుముఖంగా ఉన్నట్లు తాజా సమాచారం. అన్నీ కుదిరితే, ఈ సినిమా కొత్త ఏడాదిలోనే సెట్స్‌ పైకి వెళ్లనుందట. జనవరి నెలాఖరున కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సమంత హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో అదరగొడుతోంది. విలక్షణ పాత్రలున్న సినిమాలను అస్సలు వదులుకోవడం లేదు. సంచలనాత్మకమైన ఈ స్టోరీని అస్సలు వదులుకోదు కదా. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS