ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అంచనాలు పెరిగిపోయాయి. అంతకుముందే 'మహానటి' టాలీవుడ్ లో క్లాసిక్ గా నిలించింది. వెండితెరపై సావిత్రమ్మ జీవితం ప్రాణం పోసుకున్నట్లే.. ఎన్టీఆర్ జీవితం కూడా ప్రాణం పోసుకుంటుదని భావించారు అభిమానులు. అయితే కథానాయకుడు తెరపై మెప్పించలేకయాడు. డై హార్ట్ ఫాన్స్ ని సైతం అప్‌సెట్ చేశాడు.
రెండో భాగంగా వచ్చిన 'మహానాయకుడు' పరిస్థితి కూడా అదే. ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం. ఆయన జీవితం గురించి అందరికీ తెలుసు. ఐతే దర్శక నిర్మాతలు మాత్రం.. తమకు కావాల్సినదే తీసుకున్నారనే విమర్శ ఎదురుకోవాల్సివచ్చింది. రెండు భాగాలు తీసినప్పటికీ.. ఎన్టీఆర్ జీవితాన్ని సగంలోనే ముగించేశారన్న సంగతి ఒప్పుకోవాల్సిన వాస్తవం. మొత్తానికి వెండితెరపై ఎన్టీఆర్ ని మళ్ళీ చూడాలనుకున్న ప్రేక్షకుల ఆశని తీర్చలేకపోయింది ఈ బయోపిక్. ఆర్థికంగా కూడా చాలా నష్టాల్ని మిగిల్చిన బయోపిక్ ఇది. విద్యాబాలన్, రానా, కల్యాణ్‌రామ్ లాంటి స్టార్లున్నా, చాలామంది కథానాయికలు అతిథి పాత్రలలో మెరిసినా, ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. దర్శకుడిగా క్రిష్ కెరియర్‌కీ ఇది పెద్ద ఎదురు దెబ్బే.