ఈవారం ప్రేక్షకుల ముందుకి మూడు చిత్రాలు రావడంతో సినీ అభిమానులకి సైతం ఈ వారం తమకి ఏ సినిమా చూడాలన్న ఛాయిస్ దొరికినట్టయింది.
ఇక ఈ మూడు చిత్రాలలో మొదటిది- కేర్ అఫ్ కంచరపాలెం. ఒక చిన్న సినిమాగా మొదలై చిన్న సినిమాలలో పెద్ద సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నది అంటే దాని వెనుక హీరో రానా ఆయన నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ పాత్ర మరువలేనిది.
ఇక కథ విషయానికి వస్తే- కంచరపాలెం అనే ఊరిలో నాలుగు ప్రేమ జంటల మధ్య ప్రేమ దాని తాలుకా పర్యవసానాలే ఈ చిత్ర కథ. అయితే ఈ సినిమాని కంచరపాలెం అనే ఊరిలో తీయడమే గాక అక్కడ ఉన్న వారితోనే ఆయా పాత్రలు చేయించడమే ఈ చిత్రానికి మొదటి హైలైట్. ఇక వాస్తవికతకి అద్దంపట్టేలా అవాస్తివికతకి దూరంగా ఈ చిత్రాన్ని రూపొందించడంలో రచయిత-దర్శకుడు వెంకటేష్ మహా ని మెచ్చుకోకతప్పదు. కచ్చితంగా తెలుగు సినిమాకి ఈ సినిమా రూపంలో ఒక మంచి సినిమాగా కేర్ అఫ్ కంచరపాలెం మిగిలిపోనుంది.
రెండవ చిత్రం మను. దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా ఈ చిత్రాన్ని సామన్య ప్రజలు ఇచ్చిన నగదుతో తీసిన క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇక నిర్మాణంలో ఎంత వైవిధ్యం ఉందొ కథ కూడా అంతే వైవిధ్యంగా తీసుకున్నాడు దర్శకుడు ఫణీంద్ర.
ఒక థ్రిల్లర్ కథాంశాన్ని మూడుగంటల పాటు చెప్పాలనుకోవడం నిజంగా సాహసమే.. అయితే దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా ఇంటెలెక్చువల్ గాతీసినా.. అది ప్రేక్షకులకి అర్దమవ్వకపోయేసరికి ఈ చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుంది. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమాకి ప్రేక్షకుల ఆదరణ దక్కి ఉండేది అన్న భావన వ్యక్తమవుతున్నది.
ఇక ముచ్చటగా మూడవ చిత్రం- సిల్లీ ఫెలోస్. చాలా కాలం తరువాత సునీల్ ఒక ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా ఈ చిత్రం చేయడం... ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేష్ తనకి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతో కలిసి చేసిన చిత్రమే ఈ సిల్లీ ఫెలోస్.
ఈ సినిమా కథ రొటీన్ గా ఉండడం, పెద్దగా ట్విస్టులు వంటివి లేకపోవడం వంటి కారణాలతో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చాలాకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వీరికి ఈ సినిమా యావరేజ్ టాక్ రావడంతో సరైన హిట్ కోసం మరింతకాలం నిరీక్షించక తప్పని పరిస్థితి.
ఇది ఈవారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.