అమిత్ & శ్యామల – ఈ ఇద్దరిలో ఎవరు?

By iQlikMovies - September 09, 2018 - 17:56 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ సీజన్ 2 ఆఖరి రెండు వారాలకి చేరుకోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రేపటి నుండి ఇంటిలో 7 గురు సభ్యులే బిగ్ బాస్ ఇంటిలో మిగలనున్నారు.

ఇక ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకి వచ్చేది ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం ఇంకొక మూడు నలుగు గంటల్లో తేలిపోనుంది. అయితే పోయినవారం నూతన్ నాయుడు ఇంటినుండి ఎలిమినేట్ అవ్వడంతో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి.

అందుకనే ఈ సారి ఇంటినుండి నిష్క్రమించేది ఎవరో అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు షో చూస్తున్నవారిలో ఉన్న అభిప్రాయం ప్రకారం ఈ వారం ఇంటి నుండి వెళ్ళిపోయేది అమిత్ అని తెలుస్తున్నది. కాని షోలో ఎలిమినేషన్ ట్విస్టుల నేపధ్యంలో శ్యామల అయినా వెళ్లిపోవచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.

ఏదేమైనా ఈ ఇద్దరిలో మాత్రం ఒకరు వెళ్ళిపోతారు అనేది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS